వరుడు టైంకు రాలేదని బావను పెళ్లాడిన యువతి

  • యూపీలోని ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమంలో ఘటన
  • నూతన దంపతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.51 వేల కోసం యువతి వింత నిర్ణయం
  • యువతి బావకు అప్పటికే పెళ్లైనట్టు కూడా గుర్తించిన అధికారులు 
  • ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి

వివాహ వేడుకకు వరుడు సమయానికి రాకపోవడంతో ఓ వధువు తన బావను పెళ్లాడింది. యూపీలోని ఝాన్సీ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసినట్టు భావిస్తున్న పోలీసులు దర్యాప్తునకు ఆదేశించారు.

సీఎం సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు రూ.51 వేల చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలకు పెళ్లిళ్లయ్యాయి. ఇక, బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది. అయితే, పెళ్లి సమయంలో మాత్రం వధువు పక్కన మరో వ్యక్తి కనిపించాడు.

ఈ క్రమంలో అధికారులు ఆరా తీయగా పెళ్లికొడుకు వేళకు రాలేదని తేలింది. దీంతో, పెద్దల సలహా మేరకు తాను కూర్చున్నట్టు నకిలీ వరుడు చెప్పాడు. అతడు ఖుషీకి వరుసకు బావ అవుతాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *